అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో శశికళను చేర్పించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం పళనిస్వామితో మాట్లాడుతున్నట్లు వచ్చిన వార్తలపై భాజపా తమిళనాడు ఇంఛార్జ్ సీటీ రవి స్పందించారు. శశికళను కూటమిలో చేర్చుకోవడం అన్నాడీఎంకే నిర్ణయిస్తుందని, భాజపాకు సంబంధం లేదని అన్నారు. ఈ విషయంలో అమిత్ షా, పళనిస్వామితో మాట్లాడుతున్నట్లు వస్తున్నవి కేవలం వదంతులేనని స్పష్టం చేశారు. సీట్ల పంపకాలపై కూటమిలో గొడవలు లేవని చెప్పారు.
"శశికళ, అమ్మ మక్కల్ మన్నేట్ర కజగం పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్ బలాలు, బలహీనతలు పళనిస్వామికి, పనీర్సెల్వంకు తెలుసు. అన్నాడీఎంకే కూటమిలోకి శశికళను, దినకరన్‌ను చేర్చుకునే విషయంపై వారే నిర్ణయం తీసుకుంటారు."
-సీటీ రవి, భాజపా తమిళనాడు ఇంఛార్జ్