భాజపా పథకాలతో నడుస్తోంటే.. టీఎంసీ మాత్రం కుంభకోణాలతో నడుస్తోందని బంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పదేళ్ల క్రితమే మమత అసలు రంగు బయటపడుంటే.. బంగాల్ ప్రజలు ఆమెను ఎన్నుకునేవారు కాదని అన్నారు. బంగాల్లోని బంకురాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు.
నిజమైన అభివృద్ధి(అసోల్ పరివర్తన్) త్వరలోనే ప్రారంభం కానుందన్నారు మోదీ. బంగాల్లో అవినీతిని ఇకపై కొనసాగనివ్వమని హామీ ఇచ్చారు.
"బంగాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో ఓడిపోతానని గ్రహించిన మమత.. ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీదీకి నా మఖం ఇష్టం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాసేవనే చూస్తారు.. ముఖం కాదు."