vaccination top states in india: కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే.. భాజపా పాలిత రాష్ట్రాల్లో (vaccination in bjp ruled state) వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎనిమిది భాజపా పాలిత రాష్ట్రాల్లో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇప్పటికే పూర్తయింది. అందులో ఏడు రాష్ట్రాల్లో 90 శాతానికిపైగా మొదటి డోసు పూర్తయింది. అదే కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలో (vaccination in congres ruled states) టీకా ప్రక్రియ ఆశించిన స్థాయిని అందుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి.
బూస్టర్ డోసు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న ప్రతిపక్షాలు.. తమ రాష్ట్రాల్లో తగినంతగా వ్యాక్సినేషన్ పంపిణీ చేయలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. టీకా పంపిణీపై రాజకీయాలు ప్రభావం చూపడంపై సంబంధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రతిపక్షాలు టీకా డ్రైవ్లను రాజకీయం చేస్తున్నాయని భాజపా తరచూ విమర్శిస్తోంది. భారత్లో తయారైన టీకాలపై విపక్ష నాయకులు గతంలోనూ విమర్శలు గుప్పించారు.