భాజపా, ఆర్ఎస్ఎస్లు ఎక్కడికెళ్లినా ప్రజల్లో విద్వేషాలను, విభజన బీజాలను నాటుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బంగాల్లోని డార్జిలింగ్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.
"మా చరిత్ర, సంస్కృతి దాడుల్ని ఎదుర్కొంటోందని అసోం ప్రజలు చెప్పారు. తమిళనాడు, బంగాల్ కూడా అదే విధమైన దాడుల్ని ఎదుర్కొంటున్నాయి. భాజపా, ఆర్ఎస్ఎస్ ఎక్కడికెళ్లినా విద్వేషాల్ని వ్యాపింపచేస్తాయి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
బంగారు బంగాల్ నిర్మిస్తామని భాజపా అంటోందని, అవన్నీ ఎండమావుల్లాంటి హామీలే అని విమర్శించారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా 'మీ రాష్ట్రం బంగారు రాష్ట్రం చేస్తాం' అని భాజపా చెబుతోందని అన్నారు.