బంగాల్ ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాల వ్యక్తులను భారతీయ జనతా పార్టీ(భాజపా).. తీసుకురాకుండా తాను ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. నదియా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దీదీ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి భాజపాయే కారణమని విమర్శించారు.
"కరోనా కేసులు ఎక్కువగా ఉన్న గుజరాత్ నుంచి ప్రజలను భాజపా తెప్పిస్తోంది. ప్రధాని మోదీ, ఇతర భాజపా నేతలు ప్రచారానికి వస్తే మేము చేసేదేమీ లేదు. అయితే.. సభల్లో వేదికలు, గుడారాల నిర్మాణానికి గుజరాత్ నుంచి కార్మికులను తీసుకొస్తున్నారు. ఈ పనులను స్థానిక కార్మికులతోనే చేయిస్తే సరిపోతుంది."