కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రకటించింది. మొత్తం 140 స్థానాలకు గానూ 112 మంది అభ్యర్థులను పేర్లు ప్రకటించింది. 115 స్థానాలకు పోటీ చేస్తున్నామని, మిగిలిన స్థానాలను ఇతర పార్టీలకు కేటాయించినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్ పాలక్కడ్ నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ రెండు స్థానాల నుంచి (మంజేశ్వర్, కొన్ని) పోటీ చేయనున్నారు.
తమిళనాడులో 20 స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది భాజపా.
తమిళనాడులో ప్రముఖలు వీరే..
- ధరపురం- మురుగన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
- థౌజండ్ లైట్స్- సినీ నటి ఖుష్బూ
- కోయంబత్తూర్ సౌత్- వనతి శ్రీనివాసన్, మహిళా సెల్ నాయకురాలు
- కరైకుడి-హెచ్ రాజా, సీనియర్ నాయకుడు