అసలైన భారతీయ పౌరుల హక్కుల పరిరక్షణ, చొరబాట్ల నివారణ, స్థానిక యువతకు ఉపాధి కల్పనే ప్రధానాంశాలుగా అసోం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది భాజపా. గువాహటిలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
అసోం ఎన్ఆర్సీ సవరణకు భాజపా హామీ - ఎన్ఆర్సీపై భాజపా
అసోంలో అకర్షణీయమైన హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది భాజపా. వచ్చే ఏడాది మార్చి 22 నాటికి యువతకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసింది.
అసోం ఎన్నికలు: భాజపా మేనిఫెస్టో విడుదల
భాజపా తమ మేనిఫెస్టోలో పది వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొంది.
- సవరించిన ఎన్ఆర్సీ ఆధారంగా అసలైన భారతీయ హక్కులు పరిరక్షిస్తాం.
- ప్రతి విద్యార్థికి ఉచిత విద్య.
- వరదలను అదుపు చేసేందుకు సత్వర చర్యలు.
- అత్మనిర్భర్ అసోం
- ఒరుందోయి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.3000 (ప్రస్తుతం రూ.830 చెల్లిస్తున్నారు)
- అర్హత కలిగిన వారికి భూమిపై హక్కు
- సరైన సమయం వచ్చినప్పుడు పౌర చట్టం అమలు
- యువతకు ఉద్యోగ కల్పన-అసోం అభివృద్ధి
ఇదీ చదవండి:జమ్ములో భారీ హిమపాతం-రాకపోకలకు అంతరాయం
Last Updated : Mar 23, 2021, 2:49 PM IST