పార్టీ అజెండా రూపకల్పనలో కీలకంగా వ్యవహరించే జాతీయ కార్యనిర్వాహక బృందంలో(bjp national executive body) 80 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news) నుంచి కేంద్ర మంత్రులు, పలువురు రాష్ట్రాల నాయకులు, పార్టీ సీనియర్ నేతలైన ఎల్కే అడ్వాణీ(l k advani news), మురళీ మనోహర్ జోషి ఉన్నారు.
అలాగే.. కార్యనిర్వాహక బృందంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఇటీవలే మంత్రివర్గంలో చేరిన అశ్వినీ వైష్ణవ్ సహా పలువురి పేర్లు ఉన్నాయి. మాజీ మంత్రులు హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్కూ చోటు కల్పించారు.
భాజపా జాతీయ కార్యనిర్వాహక కమిటీ నుంచి మేనకా గాంధీ, వరుణ్‌గాంధీని తొలగించారు.
80 మంది సాధారణ సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది, శాశ్వత ఆహ్వానితులుగా 179 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేశారు.