తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా భాజపాకు రూ.276.45 కోట్లు!

2019-20 ఏడాదికి గానూ.. ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలు ప్రకటించింది.. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR). మొత్తం విరాళాల్లో అత్యధికంగా 76.17 శాతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకే వచ్చినట్లు వెల్లడించింది.

electoral trusts Donations in 2019-20
ఎలక్ట్రోరల్ బాండ్ల విరాళాల వివరాలు

By

Published : Jun 23, 2021, 7:01 PM IST

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. 2019-20 ఏడాదికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా ఆ పార్టీకి రూ.276.45 కోట్లు విరాళాలు వచ్చాయి. అన్ని పార్టీలకు వచ్చిన విరాళాల్లో భాజపాకే అత్యధికంగా 76.17 శాతం విరాళాలు రావడం గమనార్హం. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి రూ.58 కోట్లు (15.98శాతం) వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) నివేదిక వెల్లడించింది.

పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన జాబితాలో జేఎస్‌డబ్ల్యూ, అపోలో టైర్స్‌, ఇండియా బుల్స్‌, దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్స్‌ ఉన్నాయి. ఒక్క జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ అత్యధికంగా రూ.39.10 కోట్లు విరాళంగా ఇచ్చింది. అపోలో టైర్స్‌ రూ.30 కోట్లు, ఇండియా బుల్స్‌ రూ.25 కోట్లు సమకూర్చాయి. భాజపా, కాంగ్రెస్‌ కాకుండా మరో 12 పార్టీలకు ఎలక్ట్రోరల్‌ ట్రస్టుల ద్వారా రూ.25.46 కోట్లు అందాయి. ఈ జాబితాలో ఆప్‌, ఎస్‌హెచ్‌ఎస్‌, ఎస్సీ, యువ జన్‌ జాగృతి పార్టీ, జననాయక్‌ పార్టీ, జేడీయూ, జేఎంఎం, ఎల్జేపీ, ఎస్‌ఏడీ, ఐఎన్‌ఎల్డీ, జేకేఎన్‌సీ, ఆర్‌ఎల్డీ ఉన్నాయని ఏడీఆర్‌ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏడు ఎలక్ట్రోరల్‌ ట్రస్టులు ఈసీకి సమర్పించిన విరాళాల ఆధారంగా ఈ వివరాలను ఏడీఆర్‌ వెల్లడించింది.

ఇదీ చదవండి:పవార్​తో పీకే మూడోసారి భేటీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details