తెలంగాణ

telangana

ETV Bharat / bharat

JP Nadda: 'సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ ఇదే మా విధానం' - భాజపా న్యూస్​

JP Nadda: 'సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్'తో భారతీయులు సాధికారత పొందుతున్నారని దేశం ఉజ్వల భవిష్యత్తుతో ముందుకెళ్తుందన్నారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీ ప్రభుత్వ హయాంలో విద్వేషపూరిత ప్రసంగాలు, మత పరమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు.

jp nadda bjp
jp nadda bjp

By

Published : Apr 19, 2022, 5:10 AM IST

JP Nadda: మోదీ ప్రభుత్వ హయాంలో విద్వేషపూరిత ప్రసంగాలు, మత పరమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు. మనజాతి స్ఫూర్తిపై ప్రతిపక్షాలు ప్రత్యక్ష దాడికి పాల్పడుతున్నాయని, కష్టపడి పనిచేసే పౌరులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక చెల్లవని పేర్కొన్నారు.

'సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్'తో భారతీయులు సాధికారత పొందుతున్నారని దేశం ఉజ్వల భవిష్యత్తుతో ముందుకెళ్తుందని నడ్డా వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని యువతకు ఇలాంటి విమర్శలతో కూడిన రాజకీయాలు అవసరం లేదన్నారు. వారికి కావలసింది అవరోధాలు కాదని.. అభివృద్ధి, అవకాశాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు వారి తీరును మార్చుకోవాలని అభివృద్ధి రాజకీయాలను స్వీకరించాలని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ప్రజలు భాజపాకు తిరుగులేని విజయాన్ని అందించారన్నారు. ఎన్నో దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పార్టీలు ఇప్పుడు చరిత్ర అంచులకే ఎందుకు పరిమితమయాయో ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం

ABOUT THE AUTHOR

...view details