తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''కొవిడ్ సేవ'ను ప్రజల్లోకి తీసుకెళదాం'

మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈనెల 30వ తేదీతో ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారాన్ని చేపట్టి రెండేళ్లవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

By

Published : Apr 22, 2021, 9:30 AM IST

modi image
మోదీ, నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారాన్ని చేపట్టి ఈ నెల 30వ తేదీతో రెండేళ్లు పూర్తవుతుంది. ఈ రెండేళ్ల వార్షికోత్సవాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దేశాన్ని కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల(కొవిడ్ సేవ)ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా టీకాలను ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని నొక్కిచెప్పాలని అనుకుంటున్నారు.

త్వరలో బంగాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ తర్వాత భాజపా కార్యకర్తలను రంగంలోకి దింపి.. కొవిడ్ రోగుల్ని ఆసుపత్రుల్లో చేర్చించడం, ఆక్సిజన్, మందులు, టీకాల సరఫరా తదితరాల్లో వారికి సహకరించే పనిని అప్పగించాలని భావిస్తున్నారు. ఈ ఉత్సవాల్ని ఎంతో బాధ్యతాయుతంగా, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా నిర్వహించాల్సి ఉందని భాజపా సీనియర్ నేత ఒకరు చెప్పారు. గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజోపయోగ కార్యక్రమాల్ని జనం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:భారత్​కు బయలుదేరిన 4 రఫేల్​ విమానాలు

ABOUT THE AUTHOR

...view details