తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గూండాయిజం భాజపా డీఎన్​ఏలోనే ఉంది'.. ఆప్​ నేత తీవ్ర వ్యాఖ్యలు - అతిషి న్యూస్​

AAP MLA ON BJP Party: అరవింద్​ కేజ్రీవాల్​ ఇంటిపై దాడి కేసులో అరెస్టైన కార్యకర్తలను భాజపా సన్మానించిందని.. గూండాలు, రేపిస్టుల పార్టీ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆప్​ ఎమ్మెల్యే అతిషి. గూండాయిజం వారి డీఎన్​ఏలోనే ఉందని ఆరోపించారు. అయితే.. ఆమె తన నాయకుడి మెప్పు కోసమే ఇలా మాట్లాడారని భాజపా దిల్లీ చీఫ్​ ఆదేశ్​ గుప్తా విమర్శించారు.

bjp latest news
AAP MLA ON BJP Party

By

Published : Apr 16, 2022, 7:26 AM IST

AAP MLA ON BJP Party: భాజపా గూండాల, రేపిస్టుల పార్టీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆప్​ ఎమ్మెల్యే అతిషి. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఇంటిపై దాడి కేసులో అరెస్టైన కార్యకర్తలను భాజపా సన్మానించిందని.. భాజపాపై విరుచుకుపడ్డారు. ఈ చర్యలతో దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు విధ్వంసం సృష్టించాలనే సందేశం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. భాజపా మహిళలను వేధిస్తుందని.. గూండాయిజం దాని డీఎన్​ఏలోనే ఉందని ఆరోపించారు. దేశ ప్రజల ముందు గూండాల పార్టీ భాజపా, విద్యావంతుల పార్టీ ఆప్​ రెండు అవకాశాలు ఉన్నాయని.. ఈ రెండింట్లో ఏది మంచిదో ప్రజలే ఎంచుకోవాలన్నారు.

భాజాపా కౌంటర్​ అటాక్​: ఆప్​ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్​ గుప్తా ఖండించారు. ఆమె తన నాయకుడి మెప్పు కోసమే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆప్​ ఎమ్మెల్యే అత్యాచారం కేసుపై అతిషి పశ్చాత్తాపడాలన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే రాష్ట్ర మాజీ ముఖ్య కార్యదర్శిపై ఆప్​ కార్యకర్తలు దాడి చేసారని గుర్తు చేశారు. భాజపా జాతీయవాదుల, దేశభక్తుల పార్టీ అని ఆయన కొనియాడారు. కశ్మీరి పండిట్ల విషయంలో కేజ్రీవాల్​ తీరుపై.. తాము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపామన్నారు.

కేజ్రీవాల్​ ఇంటిపై దాడి: మార్చి 30న 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై కేజ్రీవాల్​ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిపై దాడి జరిగింది. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దీనిపై స్పందించిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. పంజాబ్​లో ఆప్ ఘనవిజయం సాధించడాన్ని భాజపా జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు.

ఇదీ చదవండి:మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details