తెలంగాణ

telangana

ETV Bharat / bharat

75 వారాలు.. 75చోట్ల.. 75వ స్వాతంత్య్ర వేడుకలు - Amrit Mahotsav latest news

పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ భేటీ నిర్వహించారు. పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది 'అమృత్​ మహోత్సవ్'​ పేరుతో నిర్వహిస్తున్న 75వ స్వాతంత్య్ర వేడుకల్లో భాజపా ఎంపీలందరూ పాల్గొనాలని మోదీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు.

BJP parliamentary party meeting
ఏడాది తర్వాత భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ

By

Published : Mar 10, 2021, 10:28 AM IST

Updated : Mar 10, 2021, 12:36 PM IST

దాదాపు ఏడాది తర్వాత భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. కొవిడ్ కారణంగా ఏడాదిగా ఈ భేటీని వాయిదా వేశారు. ఈ సమావేశానికి.. భాజపా ఎంపీలందరూ హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ సహా ఇతర సీనియర్ నేతలు వారికి దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ భేటీకి రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్, కేంద్రమంత్రులు ఎస్​ జైశంకర్​, ప్రహ్లాద్ పటేల్​, నిర్మలా సీతారామన్​ హాజరయ్యారు.

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం
భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

75వ స్వాతంత్య్ర వేడుకలు

ఈ ఏడాది 'అమృత్​ మహోత్సవ్'​ పేరుతో నిర్వహిస్తున్న 75వ స్వాతంత్య్ర వేడుకల్లో భాజపా ఎంపీలందరూ పాల్గొనాలని మోదీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు. ఈ వేడుకలను 75 వారాల పాటు, దేశవ్యాప్తంగా 75 చోట్ల నిర్వహించునన్నట్లు పేర్కొన్నారు. మార్చి 12న గుజరాత్​లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం

కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమంలోనూ ఎంపీలందరూ పాల్గొని ప్రజలకు సాయం అందించాలని మోదీ సూచించినట్లు జోషి చెప్పారు. వ్యాక్సినేషన్​ కేంద్రాలకు చేరుకునే ప్రజలకు వాహనాలు ఏర్పాటు చేయాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:తీరథ్​ సింగ్​ రావత్​కు ఉత్తరాఖండ్​ పగ్గాలు

Last Updated : Mar 10, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details