దిల్లీలోని కేంద్ర కార్యాలయంలో భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ భేటీలోనే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. భాజపా పార్లమెంటరీ బోర్డులో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బియల్ సంతోష్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో తమకు ఉన్న ప్రాధాన్యాలపై చర్చిస్తారు. అనంతరం ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత బోర్డు ఎన్డీఏ మిత్రాపక్షాలతో మాట్లాడి రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేస్తుంది. ఆ తర్వాత అధికారిక ప్రకటన చేయనుంది.
భాజపా పార్లమెంటరీ బోర్డు భేటీ.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు - రాష్ట్రపతి అభ్యర్థి
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉన్నారు.
మరోవైపు ప్రతిపక్షాలు ఇప్పటికే తమ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాయి. కేంద్రమాజీ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరును అధికారికంగా ప్రకటించాయి. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఆధ్వర్వంలో జరిగిన విపక్షాల భేటీ అనంతరం సిన్హా పేరును అధికారికంగా ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్. విపక్షాలన్నీ ఏకాభిప్రాయంతో సిన్హా పేరును ఆమోదించినట్లు చెప్పారు. ఈనెల 27న ఉదయం 11.30కి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేయనున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. ఆయనే ఎందుకు?