80 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వాహక బృందం జాబితాను విడుదల చేసిన భాజపా(bjp national executive list).. అదే జోరుతో వివిధ భేటీల నిర్వహణపై కసరత్తులు ముమ్మరం చేసింది(bjp national executive). జాతీయస్థాయి పదాధికారుల సమావేశం ఈ నెల 18న జరగనుంది. దీనికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహించనున్నారు. పార్టీలోని అన్ని 'మోర్చా'లకు సంబంధించిన అధ్యక్షులు ఈ భేటీకి హాజరవుతారు.
మరోవైపు జాతీయ కార్యనిర్వాహక కమిటీ భేటీ నవంబర్ 7 జరిగే అవకాశముంది. కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు ఈ భేటీ జరగలేదు. కమిటీని పునర్వ్యవస్థీకరించి, తాజాగా విడుదల చేసిన జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, నితిన్ గడ్కరీతో పాటు కమలదళ దిగ్గజాలు అడ్వాణీ, మనోహర్ జోషి పేర్లు ఉన్నాయి. వీరందరితో కలిసి ప్రత్యక్ష విధానంలో భేటీని నిర్వహించేందుకు భాజపా సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.