వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP Election 2022) పోటీపై అధికార భాజపా కీలక ప్రకటన చేసింది. నిషద్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో (UP Assembly Election) దిగుతున్నట్టు వెల్లడించింది. కేంద్రమంత్రి, యూపీ ఎన్నికల భాజపా ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్ లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలూ కలిసే పోటీ చేశాయి. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ.. ''నిషద్ పార్టీతో కలిసి మేం ఎన్నికలకు వెళ్తున్నాం. భాజపా, నిషద్ పార్టీ కలిసి 2022 ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో(UP Election 2022) ఉమ్మడి శక్తితో కలిసి బరిలోకి దిగుతాయి.'' అన్నారు.
సీట్ల పంపకంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. తగిన సమయంలో దీనిపై ప్రకటిస్తామన్నారు. కేవలం నిషద్ పార్టీయే కాకుండా ఇప్పటికే పొత్తులో ఉన్న అప్నాదళ్‌తో కూడా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు(UP Election 2022) తాము కలిసి పనిచేస్తామన్నారు. రాబోయే ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi news), సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోనే వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఇద్దరు నేతలపైనా ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని.. ప్రజాస్వామ్యంలో విశ్వాసమే ఎంతో ముఖ్యమన్నారు.
ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు 2022 (UP Assembly Election) ప్రారంభంలో జరగనున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో.. 2017 ఎన్నికల్లో (UP Assembly Election) భాజపా-309, ఎస్పీ-49, బీఎస్పీ-18, కాంగ్రెస్-7 సీట్లు సాధించాయి.
అసెంబ్లీ పోరు కోసం (Uttar Pradesh Election 2022) కోసం పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈసారి ఉత్తర్ప్రదేశ్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది కాంగ్రెస్. అయితే ఇటీవలే పంజాబ్లో సీఎంను మార్చిన కాంగ్రెస్.. ఆ రాష్ట్ర ఎన్నికల ముందు 'దళిత' అస్త్రాన్ని ప్రయోగించింది. ఎన్నికల్లో ఇది ప్రయోజనం చేకూరుస్తుందని ధీమాగా ఉంది. అయితే పంజాబ్లో దళిత వ్యూహం.. ఉత్తర్ప్రదేశ్లోనూ పనికొస్తుందని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహం ఉత్తర్ప్రదేశ్లో ఫలిస్తుందా?