దిల్లీలో భాజపా జాతీయ కార్యవర్గం(Bjp National Executive Meet) సమావేశమైంది. ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ వేదిక. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. బంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ భేటీలో విశ్లేషించనున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించనున్నారు.
అన్ని రకాల ముఖ్యమైన అంశాలను ఈ భేటీలో(Bjp National Executive Meet) చర్చిస్తామని భాజపా నేత ఒకరు తెలిపారు. కొవిడ్ కట్టడిలో కేంద్రం పని తీరును, టీకా పంపిణీ ప్రక్రియను ప్రశంసలు తెలిపే అవకాశం ఉందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల విదేశీ పర్యటనలను విజయవంతంగా ముంగించినందుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినందుకుగాను ఆయనకు అభినందనలు తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.