మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా భాజపా ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం నంద్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. మేదాంత ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన.. మంగళవారం తుది శ్వాస విడిచారు.
ప్రధాని సంతాపం

నంద్ కుమార్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో భాజపాను బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుందని మోదీ పేర్కొన్నారు. నంద్ కుమార్ కుటుబం సభ్యులకు సంతాపం తెలిపారు.
"ప్రజాదరణ పొందిన నేత నందూ భయ్యా మమ్మల్ని వీడి వెళ్లారు. ఆదర్శవంతమైన కార్యకర్తను, సమర్థమైన నిర్వాహకుడిని, అంకితభావంతో ఉన్న నేతను భాజపా కోల్పోయింది. నంద్ కుమార్ మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు" అని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.