భాజపా రాజ్యసభ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి రామ్‌విచార్ నేతమ్ క్రెడిట్ కార్డును దుండగులు ఫోర్జరీ చేసి దాదాపు రూ. 37,000 డ్రా చేశారు. దీనికి సంబంధించి రాయ్‌పుర్‌లోని తేలీబంధా పోలీస్ స్టేషన్లో ఎంపీ బంధువు ఒకరు గురువారం ఫిర్యాదు చేశారు.
"రామ్‌విచార్ పేరు మీద ఉన్న ఎస్బీఐ క్రెడిట్ కార్డును గుర్తుతెలియని వ్యక్తి తప్పుదారిలో ఉపయోగించి రూ.36,844ను డ్రా చేశాడు. ఈ లావాదేవీ ఫిబ్రవరి 24న జరిగింది. "
-సోనాల్ గ్వాలా, తేలీబంధా పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ
తమ కార్డు మీద రూ. 45,668 బాకీ ఉందని బ్యాంకు నుంచి ఎంపీకి ఇటీవల ఫోన్ రావటం వల్ల క్రెడిట్ కార్డు ఫోర్జరీ విషయం బయటపడింది. అయితే తను ఆ కార్డుమీద డబ్బులే తీసుకోలేదని, ఆ కార్డు 2020లోనే కాలం చెల్లటం వల్ల ఎప్పుడో నాశనం చేశానని ఎంపీ బదులిచ్చారు. రెన్యువల్ కూడా చేయించలేదని చెప్పారు. కాలం చెల్లిన కార్డును దుండగుడు రెన్యువల్ చేయించి ట్రాన్సాక్షన్ జరిపినట్లు తెలుస్తోంది.
ఎంపీ తరఫున ఆయన బంధవు వచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
ఇదీ చదవండి:మోదీపై శివసేన స్వరం మారిందా?