BJP MP Attacked: బంగాల్లో భాజపా ఎంపీ కారుపై బాంబు దాడి అంశం కలకలం రేపింది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూసి తిరిగి వస్తుండగా తన కారుపై దుండగులు బాంబు విసిరారని భాజపా ఎంపీ జగన్నాథ్ సర్కార్ ఆరోపించారు. నదియా జిల్లాలోని హరింఘటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
"'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూసి తిరిగి వస్తుండగా.. నా కారుపై దుండగులు బాంబు విసిరారు. కొద్దిలో తప్పించుకున్నాం. కాస్త దూరం వెళ్లాక కారు ఆపి.. తిరిగి చూశాం. మరో 10 నిమిషాలకు ఘటనా స్థలికి పోలీసులు వచ్చారు."
- జగన్నాథ్ సర్కార్, భాజపా ఎంపీ
బంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి..