తెలంగాణ

telangana

ETV Bharat / bharat

BJP MLAs Death: డెంగీతో భాజపా ఎమ్మెల్యే మృతి - ఆశా పటేల్ మృతి

BJP MLAs Death: గుజరాత్​ భాజపా ఎమ్మెల్యే ఆశా పటేల్(44)​.. డెంగీతో కన్నుమూశారు. మూడురోజుల క్రితం అహ్మదాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె.. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఉత్తరాఖండ్​లో మరో భాజపా ఎమ్మెల్యే కూడా మరణించారు.

bjp mla died today
బీజేపీ ఎమ్మెల్యేల మృతి

By

Published : Dec 13, 2021, 2:32 PM IST

BJP MLAs Death: గుజరాత్​ భాజపా శ్రేణుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మెహ్​సానా జిల్లాలోని ఉంజా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశా పటేల్(44) అకాల మరణమే ఇందుకు కారణం. డెంగీ జ్వరంతో శుక్రవారం(డిసెంబరు 10) అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

భాజపా ఎమ్మెల్యే ఆశా పటేల్ మృతి

Asha Patel Dies:

"ఉంజా ఎమ్మెల్యే ఆశా పటేల్​ ఇక లేరని చెప్పడానికి చాలా బాధగా ఉంది. డెంగీ జ్వరంతో అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రిలో చేరిన ఆశాను బతికించడానికి వైద్య బృందం తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి కన్నుమూశారు" అని మాజీ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్​ పేర్కొన్నారు. మరోవైపు గుజరాత్ సీఎం​ భూపేంద్ర పటేల్​, గవర్నర్​ ఆచార్య దేవవ్రత్​.. ఆశా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఆశా పటేల్ అంతిమయాత్రకు తరలివచ్చిన జనం

ఆమె భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం కోసం ఉంచి.. సోమవారమే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

ఆశా.. తొలిసారిగా 2017లో ఉంజా నుంచి కాంగ్రెస్​ టికెట్​పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత భాజపాలో వెళ్లిన ఆమె.. 2019 ఉపఎన్నికల్లోనూ విజయం సాధించారు.

Harbans Kapoor Dies:

ఉత్తరాఖండ్ అసెంబ్లీ మాజీ స్పీకర్​, భాజపా ఎమ్మెల్యే హర్బన్స్​ కపూర్​(75).. సోమవారం ఉదయం మరణించారు. ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. హర్బన్స్​ మరణానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. హర్బన్స్​ మృతి పట్ల సీఎం పుష్కర్​ సింగ్​ ధామీ, రాష్ట్ర భాజపా శ్రేణులు సంతాపం తెలిపాయి.

భాజపా ఎమ్మెల్యే హర్బన్స్​ కపూర్ మృతి

హర్బన్స్​ వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2007 నుంచి 2012 వరకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​గా విధులు నిర్వహించారు.

PM Condolences:

హర్బన్స్​ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

"ఉత్తరాఖండ్​ భాజపా సీనియర్​ నేత హర్బన్స్​ జీ మరణం కలచివేస్తుంది. ప్రజా సేవ, సామాజిక సంక్షేమానికి ఆయన చేసిన కృషికి ప్రజలు హర్బన్స్​ను ఎప్పటికీ మర్చిపోరు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి" అని మోదీ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:

Encounter In Srinagar: శ్రీనగర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Modi Varanasi Visit: వారణాసిలో ప్రధాని మోదీపై పూలవర్షం

ABOUT THE AUTHOR

...view details