తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా మృతదేహానికి ఎమ్మెల్యే అంత్యక్రియలు - corona latest news

కర్ణాటక భాజపా ఎమ్మెల్యే రేణుకాచార్య మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. గ్రామస్థులు అనుమతి నిరాకరించిన ఓ కరోనా మృతదేహానికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు.

BJP MLA Renukacharya did funeral of Corona infected
కరోనా మృతదేహానికి భాజపా ఎమ్మెల్యే అంత్యక్రియలు

By

Published : Jun 1, 2021, 1:05 PM IST

కరోనా మృతదేహానికి భాజపా ఎమ్మెల్యే అంత్యక్రియలు

కర్ణాటక హొన్నల్లి భాజపా ఎమ్మెల్యే రేణుకాచార్య.. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు ఓ కొవిడ్ మృతదేహానికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటున్నారు.

కరోనా మృతదేహానికి భాజపా ఎమ్మెల్యే అంత్యక్రియలు
కరోనా మృతదేహానికి భాజపా ఎమ్మెల్యే అంత్యక్రియలు

దేవనగరి జిల్లా హొన్నల్లి తాలుకాలోని ఓ గ్రామానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ఇటీవలే కరోనా బారినపడ్డాడు. అతడిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు రేణుకాచార్య. అనంతంరం కొద్ది గంటలకే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి​ మృతదేహాన్ని ఊళ్లోకి తీసుకెళ్లేందుకు గ్రామస్థులు నిరాకరించారు. దీంతో వారికి సర్దిచెప్పిన రేణుకాచార్య.. యువకుడి మృతదేహాన్ని అంబులెన్స్​లో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ శ్మశానానికి తీసుకెళ్లారు. అంతా తానై అంత్యక్రియలు నిర్వహించారు.

ఎమ్మెల్యే మానవతా దృక్పథాన్ని నియోజకవర్గ ప్రజలంతా కొనియాడుతున్నారు.

ఇదీ చూడండి:Covid: 2 నెలల్లో 17వేల మంది పిల్లలకు వైరస్​!

ABOUT THE AUTHOR

...view details