BJP MLA Convicted In Rape Case : మైనర్‌పై అత్యాచారం కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక నిందితుడికి రూ.10 లక్షల జరిమానా వేసింది. దీంతో ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది.
ఇదీ జరిగింది?
దుద్ది బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులార్ గోండ్ 2014 నవంబరు 4న ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు మైయర్పుర్ పోలీసులు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. అప్పుడు గోండ్ ఎమ్మెల్యే కాదు కాబట్టి పోక్సో కోర్టులో విచారణ జరిగింది. పోక్సో ఆ తర్వాత జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించాడు. దీంతో ఈ కేసును పోక్సో కోర్టు సోన్‌భద్రలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుపై దర్యాప్తు జరిగిన కోర్టు నిందితుడు రామ్దులార్కు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేగాక గోండ్‌కు రూ.25 లక్షల జరిమానా వేసింది.
డిసెంబర్ 12న దుద్ది ఎమ్మెల్యే రామ్‌దులార్ గోండ్‌ను కోర్టు దోషిగా తేల్చిందని ప్రభుత్వ న్యాయవాది త్రిపాఠి తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు విధించిన శిక్షను తగ్గించాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారని చెప్పారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే పూర్తిగా ఆదుకుంటానని కోర్టుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మైనర్‌పై అత్యాచారం జరిగినప్పుడు నిందితుడి భార్య సర్పంచ్‌గా ఉండేవారని తెలిపారు.