గుజరాత్ ముఖ్యమంత్రిగా భాజపా నేత భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో భూపేంద్ర పటేల్‌ను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. విజయ్ రూపానీ రాజీనామాతో ఏర్పడిన ఉత్కంఠకు తెరదించారు.
అయితే.. ఆయన ఒక్కరే సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తెలిపారు.
గవర్నర్‌ను కలిసిన నేతలు
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపికైన క్రమంలో గాంధీ నగర్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవ్రత్ను కలిశారు భూపేంద్ర పటేల్. ఆయనతో పాటు మాజీ సీఎం విజయ్ రూపానీ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్, పలువురు సీనియర్ నేతలు నేతలు హాజరయ్యారు.