BJP manipur manifesto: మణిపుర్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే ప్రతిభ కనబర్చిన కళాశాల విద్యార్థినులకు ద్విచక్ర వాహనాలు ఉచితంగా అందజేస్తామని భాజపా హామీ ఇచ్చింది. వృద్ధుల పింఛన్‌ను రెండు వందల నుంచి వెయ్యి రూపాయిలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు మణిపుర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. స్టార్టప్‌ల కోసం ఏకంగా వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నాయకత్వంలో రాష్ట్రం గత ఐదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు నడ్డా. డ్రగ్స్ దందాను అరికట్టడం సహా చట్టబద్ధమైన పాలనతో సుస్థిరత సాధించామని అన్నారు.
భాజపా మణిపుర్ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకాంశాలు..
- ప్రతిభ కనబరినచిన విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్ర వాహనాలు.
- మంచి మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.
- స్టార్టప్‌లకు రూ. 100 కోట్లతో ప్రత్యేక నిధి.
- వృద్ధాప్య పింఛను రూ. 200 నుంచి రూ. 1000కి పెంపు.
- ఆర్థికంగా వెనకబడిన విద్యార్థినులకు రూ. 25 వేల ఆర్థిక సాయం.
- ఉచితంగా ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు.
- పీజీ, గ్రాడ్యుయేషన్, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న చిన్న, సన్నకారు రైతుల పిల్లలకు స్కాలర్షిప్లు.
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఏడాదికి అందించే ఆర్థిక సాయం రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంపు.
- యువత నైపుణ్యాభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ ఏర్పాటు.
- ప్రజల వైద్యం కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు.
- ఔత్సాహిక యువతకు రూ. 25 లక్షల వరకు జీరో వడ్డీ రుణాలు.
- పర్యటకాన్ని ప్రోత్సహించేలా రాయితీలు.
- రాష్ట్ర పర్యటకానికి ఫో-ఫో ట్రైన్ల పెంపు
- గోటూ విలేజ్, గోటూ హిల్స్ పేరుతో ప్రజల వద్దకు పాలన.
ఇదీ చూడండి:'మీ తప్పులు అంగీకరించకుండా.. నెహ్రూను బాధ్యుల్ని చేస్తారా?'