బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉచిత రేషన్ ఇస్తామంటూ భాజపా తప్పుడు వాగ్దానాలు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఆ హామీని భాజపా ఎన్నటికీ నెరవేర్చలేదని అన్నారు.
బంకురా జిల్లా కొతుల్పుర్లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. 'భాజపా.. బయటి వ్యక్తుల పార్టీ' అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని సృష్టించేందుకు ఆ పార్టీ గూండాలను తయారు చేస్తోందని ఆరోపించారు.
" ఉచిత రేషన్ ఇస్తామంటూ భాజపా తప్పుడు హామీలు ఇస్తోంది. దాన్ని భాజపా ఎన్నటికీ నెరవేర్చదు. మిమ్మల్ని ఓటు వేయాలని అడిగేందుకు భాజపా రౌడీలు మీ ఇంటికి వస్తారు. వాళ్లు మిమ్మల్ని భయపెడితే.. ఇంట్లో ఉన్న పాత్రలను పట్టుకుని, వాళ్లను తరిమిగొట్టేందుకు సిద్ధంగా ఉండండి."