ఇటీవలే భాజపాలో చేరిన సినీనటి ఖుష్బూ సుందర్.. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించింది. తమిళనాట 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై శనివారం జరిగిన భాజపా సీఈసీ భేటీలో తుది జాబితా ఖరారైందని సమాచారం.
థౌజండ్ లైట్స్ నుంచి ఎన్నికల బరిలో ఖుష్బూ - థౌజండ్ లైట్స్ నియోజకవర్గం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున సినీ నటి ఖుష్బూ.. బరిలోకి దిగనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది.
థౌజండ్ లైట్స్ నుంచి బరిలో ఖుష్బూ!
కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరిన ఖుష్బూను చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించింది భాజపా. ఈ నియోజకవర్గం నుంచే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే.. కూటమిలో భాగంగా ఈ స్థానం పీఎంకేకు వెళ్లింది.
ఇదీ చూడండి:తమిళనాట సీట్ల సర్దుబాటుతో తారలు డీలా
Last Updated : Mar 14, 2021, 3:19 PM IST