ఉత్తారఖండ్ సీఎంగా ఈరోజు సాయంత్రం 4గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్న తీరథ్ సింగ్ రావత్.. గవర్నర్ బేబి రాణి మౌర్యను కలిశారు.
లైవ్: గవర్నర్‌ను కలిసిన తీరథ్ సింగ్ రావత్ - trivendra singh rawat

13:46 March 10
11:52 March 10
సాయంత్రం ప్రమాణం..
బుధవారం సాయంత్రం 4 గంటలకు.. ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి.
తనపై నమ్మకం ఉంచి.. ముఖ్యమంత్రిగా ప్రకటించినందుకు ప్రధాని, కేంద్ర హోం మంత్రి, పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు తీరథ్ సింగ్. తానొక చిన్న గ్రామం నుంచి వచ్చానన్న ఆయన.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
11:23 March 10
కొత్త సీఎం తీరథ్ సింగ్..
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్‌ను ఖరారు చేసింది భాజపా అధిష్ఠానం.
10:03 March 10
పార్టీ ఆఫీస్‌కు భాజపా నేతలు..
దేహ్రాదూన్‌లోని పార్టీ కార్యాలయంలోకి భాజపా నేతలు చేరుకుంటున్నారు.
09:46 March 10
లైవ్: గవర్నర్‌ను కలిసిన తీరథ్ సింగ్ రావత్
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకొనేందుకు.. భాజపా శాసనసభా పక్ష సమావేశం మరికాసేపట్లో జరగనుంది. భాజపా ఎమ్మెల్యేలు దేహ్రాదూన్‌లో భేటీ కానున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ సమక్షంలో ఈ సమావేశం జరగనుంది.
నాయకత్వ మార్పుపై గత కొంత కాలంగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాణిమౌర్యను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయంతోనే తాను పదవి నుంచి తప్పుకున్నట్టు వెల్లడించారు.
ఆరుగురి పేర్లు పరిశీలన..
సీఎం పదవి కోసం ఆరుగురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, రాష్ట్ర మంత్రులు ధన్సింగ్ రావత్, సత్పాల్ మహరాజ్ సహా మరికొందరు నేతలను ఇందుకోసం భాజపా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.