తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మమతకు గాయం'పై ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదులు - మమతా బెనర్జీ కాలికి గాయం

మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి తృణమూల్​ కాంగ్రెస్​, భాజపా పోటాపోటీగా ఫిర్యాదులు చేశాయి. ఉన్నత స్థాయి విచారణ జరపాలని టీఎంసీ డిమాండ్​ చేయగా.. స్వతంత్ర దర్యాప్తు చేపట్టి, ఘటనకు సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని కోరింది భాజపా.

BJP, TMC meets EC
'మమత గాయం'పై భాజపా-టీఎంసీ పోటాపోటీ ఫిర్యాదులు

By

Published : Mar 12, 2021, 7:18 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేశాయి అధికార తృణమూల్​ కాంగ్రెస్​, విపక్ష భాజపా.

శుక్రవారం ఉదయం టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీలు దిల్లీలో ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. మమత కాలికి గాయమైన ఘటన అనుకోకుండా జరగలేదని, కుట్రపూరితంగానే జరిగిందని ఆరోపించారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్​ చేశారు.

ఈసీకి భాజపా ఫిర్యాదు..

మమత కాలికి గాయమైన ఘటనపై భాజపా నేతలు శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్​ చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేందర్​ యాదవ్​ తెలిపారు. మార్చి 10న మమత ఎన్నికల ర్యాలీకి సంబంధించిన వీడియోను విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు.

టీఎంసీపై భాజపా విమర్శలు..

ఈ వ్యవహారంపై టీఎంసీ కుట్రపూరిత కథనాలు ప్రచారం చేసి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించింది భాజపా. రాష్ట్రంలో ఆదరణ కోల్పోతున్నందునే ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని విమర్శించింది. టీఎంసీ సీనియర్​ నేతలు సైతం రాష్ట్ర అధికార యంత్రాంగం మాటలను వక్రీకరించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణకు డిమాండ్​ చేశారు భాజపా అధికార ప్రతినిధి శామిక్​ భట్టాచార్య. మమత త్వరగా కోలుకుని, ప్రచారంలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:ఆసుపత్రి నుంచి మమతా బెనర్జీ డిశ్చార్జ్​

ABOUT THE AUTHOR

...view details