ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో భాజపా నేతను నక్సలైట్లు అత్యంత పాశవికంగా హత్య చేశారు. జిల్లాలోని ఉసూరు మండల భాజపా అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను.. కుటుంబ సభ్యుల ముందే గొడ్డలి, కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు. నీలకంఠ కక్కెం తన స్వగ్రామమైన ఆవపల్లిలో మరదలి వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున సమయంలో నక్సలైట్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన స్థలంలో నక్సలైట్లు తామే ఈ హత్య చేసినట్లుగా కరపత్రాల్లో రాసి విడిచి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలోనూ నీలకంఠ కక్కెంను చంపుతామని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నక్సల్స్ కిరాతకం.. కుటుంబ సభ్యుల ముందే భాజపా నేత కత్తులతో నరికి హత్య - Maoists Murdered BJP Leader Nilkhant Kakkam
ఛత్తీస్‌గఢ్‌లో భాజపా నాయకుడు నీలకంఠ కక్కెమ్ మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యుల ముందే గొడ్డలి, కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు.
ముందుగా అవపల్లి గ్రామానికి చేరుకున్న నక్సలైట్లు.. ఇంట్లో ఉన్న నీలకంఠ కక్కెంను బయటకు తీసుకొచ్చి గొడ్డలి, కత్తులతో నరికి చంపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, గత 15 ఏళ్లుగా కక్కెం ఉసూరు మండల భాజపా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. రెండేళ్ల క్రితం ఇదే జిల్లాలో మరో భాజపా నేత మజ్జీతో పాటు పార్టీ యువనేత జగదీష్ కొండ్రాను కూడా నక్సలైట్లు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
TAGGED:
BJP leader Neelkanth Kakkem