భాజపా నాయకురాలు కుష్బూ సుందర్... తమిళనాడులోని థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. గురువారం నామపత్రాలను సమర్పించారు.
అంతకుముందు.. వల్లువర్కోటంలో భారీ రోడ్ షో నిర్వహించారు కుష్బూ. ఇందులో పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజలు భారీ స్థాయిలో తరలివెళ్లారు.