తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​ ఎన్నికల కోసం అమిత్​ షా ట్రయాంగిల్​ స్కెచ్​!

Amit shah on Punjab elections: కొద్ది నెలల్లో పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్​ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​, శిరోమణి అకాలీ దళ్​ మాజీ నేత దిండ్సాతో మంతనాలు జరుపుతున్నారు.

Punjab elections
అమిత్​ షా

By

Published : Dec 4, 2021, 5:51 PM IST

Amit shah on Punjab elections: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో వ్యూహాలకు పదును పెడుతోంది భారతీయ జనతా పార్టీ. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​, శిరోమణి అకాలీ దళ్​​ మాజీ నేత సుఖ్​దేవ్​ సింగ్​ దిండ్సాతో కూటమి ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

హెచ్​టీ నాయకత్వ సదస్సు-2021లో భాగంగా పంజాబ్​ ఎన్నికల్లో భాజపా వ్యూహాలపై పలు విషయాలు వెల్లడించారు అమిత్​ షా. పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలపై రైతుల ఆందోళనలు ప్రభావం చూపిస్తాయనే వాదనలను తోసిపుచ్చారు. నూతన సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత సమస్య లేదన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో మంచి మెజారిటీతో భాజపా మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

" మేము కెప్టెన్​ సాబ్​(అమరిందర్​ సింగ్​), దిండ్సా సాబ్​(అకాలీ దళ్​​ మాజీ నేత సుఖ్​దేవ్​ సింగ్​)తో చర్చలు జరుపుతున్నాం. వారి పార్టీలతో కూటమి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సానుకూల ధోరణితో ఇరు పార్టీలతో చర్చిస్తున్నాం. రైతుల ఆందోళనలకు ముగింపు పలికేందుకు ప్రధాని మోదీ పెద్ద మనసుతో నిర్ణయం తీసుకున్నారు. సాగు చట్టాలు రైతులకు అనుకూలంగా లేవని మీరు భావిస్తుండొచ్చు, ఇప్పుడు వాటిని రద్దు చేశాం. ప్రస్తుతం పంజాబ్​లో ఎలాంటి సమస్య లేదు."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

భాజపా కూటమిలోని పలు పార్టీలు అఖిలేశ్​ యాదవ్​ నేతృత్వంలోని సమాజ్​వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవటంపై ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు షా. ఓట్ల లెక్కలతో పొత్తులు కుదుర్చుకోవటం ఎన్నికలను అంచనా వేసేందుకు సరైన మార్గం కాదని తెలిపారు షా. 'రాజకీయం అనేది ఫిజిక్స్​ కాదు.. కెమిస్ట్రీ. రెండు పార్టీలు చేతులు కలిపినంతమాత్రాన వారి ఓట్లు జమవుతాయనేది సరైనది కాదని నా అభిప్రాయం. రెండు రసాయనాలు కలిస్తే.. మూడో మిశ్రమం​ వస్తుంది. గతంలో ఎస్​పీ, బీఎస్​పీ, కాంగ్రెస్​ చేతులు కలిపినా.. భాజపా అధికారంలోకి వచ్చింది. ఓటు బ్యాంకు ఆధారంగా ఏర్పడే కూటములు ప్రజలకు దిశానిర్దేశం చేయవు.' అని పేర్కొన్నారు.

amit shah speech on article 370:

జమ్ముకశ్మీర్​లో దశాబ్దాల పాటు ఆర్టికల్​ 370 అమలులో ఉందని, కానీ, అక్కడ ప్రశాంతత ఎందుకు లేదని ప్రశ్నించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. 2019లో చేపట్టిన ఆర్టికల్​ 370 రద్దు ద్వారా ఆ ప్రాంతంలో శాంతి నెలకొందని, వ్యాపార పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్​కు పర్యటకులు పెరిగినట్లు చెప్పారు. ' 2019, ఆగస్టు 5న ఆర్టికల్​ 370ని ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేయటం చాలా సంతోషంగా ఉంది. కశ్మీర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిసి కశ్మీర్​ ముందుకు సాగుతోంది.' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:చిరకాల మిత్రపక్షం భాజపాపై అకాలీలకు అలకెందుకు?

ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో​ నయా రాజకీయం!

ABOUT THE AUTHOR

...view details