Allodoxaphobia:
పదం: అలడాక్సఫోబియా
అర్థం: అభిప్రాయాలంటే అహేతుక భయం
ఎలా ఉపయోగించాలంటే..:ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం ప్రజలపై రాజద్రోహం, యూఏపీఏ కేసులు పెడుతోంది. ఎందుకంటే ఆ పార్టీ నాయకత్వం అలడాక్సొఫోబియాతో భయపడుతోంది.
ఇదీ కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ భాజపాపై విమర్శలు సంధిస్తూ ఆదివారం చేసిన ట్వీట్. ఆంగ్లభాషలో అత్యంత అరుదుగా వాడే పదాలను ఉపయోగించే అభిరుచి కలిగిన ఆయన 'అలడాక్సఫోబియా' అనే పదాన్ని ప్రయోగించారు.
Shashi tharoor word of the day: నేటి పదంగా పేర్కొంటూ దానికి అర్థాన్ని సైతం శశిథరూర్ వివరించారు. అలడాక్సఫోబియా అంటే అభిప్రాయాలంటే అహేతుక భయం అన్న అర్థం ఉందని చెప్పారు. ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలో పేర్కొంటూ యూపీలో రాజద్రోహం, యూఏపీఏ కేసులను ప్రస్తావించారు. ఈ పదానికి గ్రీక్ భాషలో ఉన్న అర్థాన్ని (Allo విభిన్న, doxo అభిప్రాయాలు, phobos ( భయం) సైతం శశిథరూర్ విడమరిచారు.
ఇదీ చూడండి:మోదీ గడ్డంపై థరూర్ 'ఇంగ్లీష్' సెటైర్!
ఇదీ చూడండి:మహిళా ఎంపీల ఫొటోతో శశిథరూర్ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం!