ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలపై (up polls 2022) చర్చించేందుకు పార్టీ నాయకులతో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని భాజపా 'విజయ్ సంకల్ప్ రథ్ యాత్ర' (BJP meetings today) పేరిట ప్రచారాన్ని ప్రారంభించనుందని సమాచారం. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాల పర్యటనలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రస్థాయి నాయకులతో ఇప్పటికే భాజపా సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. రైతుల ఉద్యమాలు ఎక్కువగా ఉన్న రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో ప్రధాని ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారని తెలుస్తోంది.