కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్ యడియూరప్పను తొలగిస్తున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీనిపై స్పందించిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. యడియూరప్పను సీఎంగా తొలగించే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు.
"యడియూరప్ప సీఎంగా కొనసాగుతారు. ఆయనను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్పను తొలగించాలనే ఆలోచనే లేదు. కొత్త సీఎం రాబోతున్నారనేది ఊహాగానం మాత్రమే."
--సీటీ రవి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి.