కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శల దాడి చేశారు. రైతుల్లో అసంతృప్తి, ద్రవ్యోల్బణం, సరిహద్దు సమస్యలు సహా అన్నింటా భాజపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యాన్ని కేంద్రం ఇక ముందు కూడా కొనసాగిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"రైతులు బాధపడుతున్నారు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. అయినా భారత్ గొప్పదే. కానీ, కేంద్ర ప్రభుత్వమే ఓడిపోయింది. ఈ ఓటమి ఇక ముందు కూడా కొనసాగుతుంది.
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత