తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో 'స్థానిక' పోరు- కార్యక్షేత్రంలోకి కాషాయదళం - అనంత్​నాగ్

జమ్ముకశ్మీర్​లో ఎన్నికలు. చాలా ఏళ్ల తర్వాత వినిపిస్తున్న మాట. ఇక సాధారణంగానే ఎన్నికలంటే ఎనలేని ఉత్సాహం చూపే భాజపా.. జమ్ముకశ్మీర్​ జరిగే స్థానిక పోరుపై ప్రత్యేక దృష్టి సారిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు అనుగుణంగానే కాషాయం పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. లోయలో నవంబరు 28నుంచి జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కమలదళం సర్వసన్నద్ధమవుతోంది.

DDC elections in J-K
జమ్మూ-కశ్మీర్​ ఎన్నికలకు.. భాజపా అస్త్రశస్త్రాలు సిద్ధం !

By

Published : Nov 24, 2020, 1:39 PM IST

జమ్ముకశ్మీర్​లో 370 అధికరణం రద్దు.. రాష్ట్ర పునర్విభజన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్​ విడుదలైన నేపథ్యంలో... భాజపా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని స్థానిక సమరంలో జయకేతనం ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్న కాషాయదళం.. రంగంలోకి కేంద్రమంత్రులు, సీనియర్​ నేతలను దింపుతోంది.

స్థానిక సమరం..

జమ్ముకశ్మీర్​లో ఎనిమిది దశల్లో నిర్వహించనున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా.. తొలిదశ పోలింగ్​ నవంబర్​ 28న జరగనుంది. ఈ తరుణంలో భాజపా జోరు పెంచింది. కశ్మీర్ లోయలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు అన్ని అవకాశాలను లెక్కేసుకుంది. ఎన్నికలకు సమాయత్తమైంది.

నవంబర్​, డిసెంబర్​లో జరగనున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలను భాజపా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 20 జిల్లాల్లో.. 280మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. వీటితో పాటే పంచాయతీ, మున్సిపాలిటీల సభ్యులనూ ఎన్నుకుంటారు. 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను నాటి ప్రాంతీయ పార్టీలు బహిష్కరించిన నేపథ్యంలో మిగిలిన స్థానాలకు ఈ ఎన్నికల్లో సభ్యులను ఎన్నుకోనున్నారు.

భాజపా ప్రణాళికలు

ఎన్నికల నేపథ్యంలో భాజపా లోయలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది భాజపా. అందులో భాగంగా ఉద్ధృత ప్రచారానికి తెరలేపింది. ఇతర పార్టీల ప్రచారానికి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితుల్లో భాజపా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు పథక రచన చేసింది.

ఇదీ చూడండి: ఎన్నికల వేళ ఆంక్షల వలయం- హోటళ్లలోనే నేతలు

భాజపా తరఫున ఇప్పటికే కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ.. ఎన్నికల ప్రచారాన్ని నవంబర్​ 19నే ప్రారంభించారు. భాజపా అధికార ప్రతినిధి షానవాజ్​ హుస్సేన్​ ఎన్నికల కోసం శ్రీనగర్​లోనే మకాం వేశారు. మరోవైపు కేంద్ర మంత్రి, ఉద్ధంపూర్​ ఎంపీ జితేంద్ర సింగ్, మంత్రులు స్మృతీ ఇరానీ, కృష్ణపాల్​ గుజ్జర్​, రమేశ్​ పోఖ్రియాల్​, అనురాగ్​ ఠాకూర్​లతో పాటు రాజ్యసభ సభ్యుడు జాఫర్​ ఇస్లాంలను రంగంలోకి దింపింది కషాయదళం.

సామాజిక సమీకరణలు..

అదే సమయంలో సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకూ సన్నద్ధమైంది భాజపా. దక్షిణ దిల్లీ ఎంపీ గుజ్జర్​ నేత రమేష్​ బిదురీని జమ్ము ఉంచింది. ఆయన బకర్వార్ ఓట్లను సమీకరించే పనిలో ఉన్నారు. కశ్మీర్​ లోయలోని అనంత్​నాగ్ జిల్లా పాహల్గాం ప్రాంతంలో బకర్వార్లు, గుజ్జర్లు ఆవాసాలు కోల్పోయి అవస్థలు పడుతున్నారు. అటవీ భూముల ఆక్రమణ పేరుతో జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం వారిని ఇళ్లు ఖాలీ చేయించింది. వీరిని ఆకట్టుకునేందుకు భాజపా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

ఇక్కడ ఏళ్లుగా ఉంటున్న స్థానికులను నిర్వాసితులు చేయటం సరికాదు. ఎవరూ వాళ్ల ఇళ్లల్లోంచి కదలరు. ఇప్పటికే దీని కోసం చట్టం రూపొందించారు. వీరందరికీ వారున్న ప్రాంతంలోనే పక్క ఇళ్లు నిర్మిస్తాం. శ్రీనగర్​లోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. జమ్ములో లేవు.

రమేష్​ బిదురి, భాజపా ఎంపీ

మొత్తంగా జమ్ము కశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికలకు భాజపా పూర్తిస్థాయి సన్నద్ధత చాటుతోంది. గతేడాది ఆగస్టులో ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. సత్తా చాటాలని పట్టుదలతో ఉంది కమలదళం. ప్రచార గోదాలోనూ ఇతర పార్టీలకంటే ముందంజలో ఉంది.

ఇదీ చూడండి: రాజకీయ పునరేకీకరణ.. కశ్మీర్‌లో 'గుప్కార్‌ కూటమి'

ఇదీ చూడండి: '370 పేరుతో గుప్కర్​ గ్యాంగ్ కొత్త నాటకం'

ABOUT THE AUTHOR

...view details