హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా కొత్తవారికి అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కీలకమైన శిమ్లా అర్బన్ అసెంబ్లీ స్థానంలో నాలుగుసార్లు గెలిచిన మంత్రిని పక్కనబెట్టి.. చాయ్‌వాలా సంజయ్ సూద్ పోటీ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. సంజయ్.. శిమ్లాలో చాయ్ దుకాణం నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి సురేశ్ భరద్వాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఆయన నాలుగు సార్లు గెలిచినప్పటికీ.. ఈసారి ఆయనను పక్కనబెట్టి సంజయ్‌కు అవకాశం కల్పించడం గమనార్హం.
చాయ్‌వాలాకు భాజపా ఎమ్మెల్యే టికెట్.. 4సార్లు గెలిచిన మంత్రిని పక్కనబెట్టి..
హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా అర్బన్ అసెంబ్లీ స్థానంలో చాయ్‌వాలా సంజయ్ సూద్ పోటీ చేస్తున్నట్లు భాజపా ప్రకటించింది. అయితే నాలుగుసార్లు గెలిచిన మంత్రి సురేశ్‌ను పక్కనబెట్టి సంజయ్‌కు అవకాశం కల్పించడం గమనార్హం.
కాగా.. మంత్రి సురేశ్‌ను కాసుంప్టి స్థానం నుంచి భాజపా నిలబెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంపై సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో 1980 నుంచే భాజపాతో కలిసి పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సంజయ్ గతంలో భాజపా శిమ్లా మండల్ అర్బన్‌కు జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆ తర్వాత జిల్లాలో పార్టీ మీడియా ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం భాజపా శిమ్లా యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నారు.