అసోంలో శాసనసభ ఎన్నికల వేళ 15 మంది సీనియర్ నేతలకు భాజపా షాకిచ్చింది. మాజీ డిప్యూటీ స్పీకర్ దిలీప్ కుమార్ పాల్ సహా.. 15 మందిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆ రాష్ట్ర భాజపా శాఖ నిర్ణయం తీసుకుంది.
అసోంలో రెబల్స్‌కు భాజపా షాక్ - దిలీప్ కుమార్ పౌల్
అసోంలో 15 మంది సీనియర్ నేతలకు షాకిచ్చింది భాజపా. ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆగ్రహించిన అధిష్ఠానం వారిని పార్టీ నుంచి బహిష్కరించింది.
అసోంలో రెబల్స్‌కు భాజపా షాక్
శాసనసభ ఎన్నికల్లో సీటు కేటాయించకపోవటంతో.. ఆ నాయకులంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆగ్రహించిన భాజపా అధిష్ఠానం.. 15 మందిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదివరకే వారంతా భాజపాకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు.
ఇదీ చదవండి:148మంది అభ్యర్థులతో భాజపా 'బంగాల్' జాబితా