BJP political donations: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతీయ జనతాపార్టీకి రూ.477 కోట్ల విరాళాలు అందాయి. ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో వచ్చిన నిధుల వివరాలను.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. భాజపాకు అత్యధికంగా 477 కోట్ల 54 లక్షల 50 వేలు విరాళాల రూపంలో రాగా.. కాంగ్రెస్‌కు రూ.74 కోట్ల 50 లక్షలు వచ్చాయని ఈసీ పేర్కొంది. అధికార పార్టీకి వచ్చిన మొత్తంలో.. అది 15 శాతమని తెలిపింది.
భాజపాకు రూ.477 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్‌కు అత్తెసరే! - భాజాపా విరాళాలు
BJP political donations: 2020-21లో భాజపాకు రూ.477 కోట్ల విరాళాలు అందాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు రూ.74.50 కోట్లు మాత్రమే విరాళాల రూపంలో వచ్చాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది.
BJP CONTRIBUTION REPORT
BJP contribution report: ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఏటా రాజకీయ పార్టీలు తమకు వివిధ సంస్థలు, ట్రస్టులు, వ్యక్తుల నుంచి రూ.20వేలకు మించి అందిన విరాళాల వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి:అసహజ శృంగారం కోసం భార్యపై ఒత్తిడి.. భర్తకు షాకిచ్చిన హైకోర్టు!