బంగాల్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అవినీతి ఆరోపణలతో మమతా బెనర్జీ సర్కార్ను భాజపా ఇరుకునపెడుతోంది. బంగాల్లో ప్రభుత్వం నీడలో వసూల్ రాజాలు చెలరేగిపోతున్నారని విమర్శించింది. అక్రమదందాలకు సంబంధించి మూడు ఆడియో టేపుల్ని విడుదల చేసింది.
ఓ సమావేశంలో కమిషనర్ ఎదురుగానే మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడైన ఓ వ్యక్తి.. డబ్బులు ఇవ్వాలని వ్యాపారుల్ని, కొందరు వ్యక్తుల్ని బెదిరించినట్లు ఆడియో టేపులో ఉందని భాజపా ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వీటిని బహిర్గతం చేశారు.