నామపత్రాల తిరస్కరణపై కేరళ హైకోర్టులో విచారణ - నామ పత్రాల తిరస్కరణపై కేరళ హైకోర్టు విచారణ
11:52 March 21
నామపత్రాల తిరస్కరణ.. కేరళ హైకోర్టులో విచారణ
కేరళ ఎన్నికల్లో తిరస్కరణకు గురైన ముగ్గురు ఎన్డీఏ అభ్యర్థుల నామపత్రాలు.. కోర్టు జోక్యంతో తిరిగి ఆమోదం పొందుతాయా లేదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నామినేషన్ల తిరస్కరణను సవాలు చేస్తూ వారు వేసిన వ్యాజ్యంపై మధ్యాహ్నం 2 గంటలకు కేరళ హైకోర్టు విచారణ జరపనుంది.
ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలస్సేరి, గురవాయూర్, దేవికుళం నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు భాజపా నుంచి ఇద్దరు, అన్నాడీఎంకే నుంచి ఒకరు నామినేషన్ వేశారు. అయితే నిబంధనలకు అనుగుణంగా లేవని రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు.