తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ భాజపా అభ్యర్థిపై కాల్పులు - బంగాల్​ పోల్స్​

బంగాల్​ మాల్దా నియోజకవర్గం భాజపా అభ్యర్థిపై జరిగిన కాల్పులు కలకలం రేపాయి. సహపుర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న గోపాల్​ చంద్ర సహాపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తృణమూల్ కార్యకర్తలే.. చంద్ర సాహాపై కాల్పులు జరిపారని భాజపా నేతలు ఆరోపించారు.

BJP Candidate of Malda Gopal Chandra Saha
బంగాల్​ భాజపా అభ్యర్థి

By

Published : Apr 18, 2021, 11:38 PM IST

బంగాల్​ మాల్దా నియోజకవర్గం భాజపా అభ్యర్థి గోపాల్​ చంద్ర సహాపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సహపుర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆయన మాల్దా మెడికల్​ కాలేజీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తృణమూల్ కార్యకర్తలే.. చంద్ర సాహాపై కాల్పులు జరిపారని భాజపా నేతలు ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా సోమవారం ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇదీ జరిగింది :'మహా'లో కరోనా కల్లోలం- కొత్తగా 68వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details