తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపాలో చేరాలని టీఎంసీ నేతలపై ఒత్తిడి'

భాజపాపై మరోసారి ధ్వజమెత్తారు తృణమూల్​ కాంగ్రెస్​ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ. భాజపాలో చేరమని తమ పార్టీ నాయకులను ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో అసమ్మతి జ్వాలలు సృష్టించేవారిని 'అవకాశవాదులు'గా అభివర్ణించారు.

BJP calling up TMC leaders, trying to coerce them to join saffron camp: Mamata
'భాజపాలో చేరాలంటూ తృణమూల్​ నాయకులపై ఒత్తిడి'

By

Published : Dec 16, 2020, 4:46 PM IST

భాజపాలో చేరమని తమ పార్టీ నాయకులను ఒత్తిడి చేస్తున్నారని తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. డబ్బు మూటలతో టీఎంసీని విడగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని కూచ్​బెహార్​లో నిర్వహించిన బహిరంగ సభలో మండిపడ్డారు. పార్టీని వీడి వెళ్తున్నవారిని 'అవకాశవాదులు'గా అభివర్ణించారు మమత.

" బంగాల్​ తృణమూల్​ అధ్యక్షుడు సుభ్రతా భక్షిను భాజపాలోకి రావాలని అడగటానికి ఆ పార్టీకి ఎంత ధైర్యం? సిద్ధాంతాలు లేని పార్టీ భాజపా. ఎన్నో ఏళ్ల నుంచి టీఎంసీకి సేవ చేస్తున్న వారే మా నిజమైన ఆస్తి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా భాజపాను ఓడిస్తాం. "

--మమతా బెనర్జీ, తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి

ఇటీవల టీఎంసీ నాయకులే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందున.. దీదీ ఈ విధంగా స్పందించారు.

ఇదీ చదవండి :18న షా సమక్షంలో కమలం గూటికి సువేందు!

ABOUT THE AUTHOR

...view details