'గంగమ్మ'కు భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసిందని ఆరోపించారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్. గంగా నది మునుపటిలాగే ఉందని, గంగమ్మను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
2022 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'సమాజ్‌వాదీ విజయ్ యాత్ర'ను చేపట్టారు అఖిలేశ్ యాదవ్. కాన్పుర్‌లో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం, గంగమ్మతో పాటు ప్రజలను కూడా మోసం చేసిందని మండిపడ్డారు.
"గంగమ్మకు భాజపా ద్రోహం చేసింది. గంగా నదీ మునుపటిలాగే దుర్భరమైన స్థితిలో ఉంది. కాన్పుర్ ఓ పెద్ద నగరం. ఇక్కడ ఉద్యోగాలున్నాయి, వ్యాపారాలున్నాయి. అవన్నీ తమ కళ్ల ముందు నాశనమవ్వడాన్ని ప్రజలు చూశారు. రైతులను కేంద్రం, రాష్ట్రంలోని భాజపా సర్కారు మోసం చేసింది. ఉద్యోగాలు లాక్కుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ప్రజలకు భాజపా ప్రభుత్వం ద్రోహం చేసింది."
--- అఖిలేశ్ యాదవ్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం.