కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తమిళనాడు భాజపా నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధం విధించాలని కోరారు.
రాహుల్ ప్రచారాన్ని నిషేధించాలని భాజపా ఫిర్యాదు - రాహుల్ గాంధీ న్యూస్
తమిళనాడులో రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి ఆ రాష్ట్ర భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు.
![రాహుల్ ప్రచారాన్ని నిషేధించాలని భాజపా ఫిర్యాదు BJP asks EC to stop Rahul Gandhi from campaigning at Tamilnadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10875369-803-10875369-1614890073646.jpg)
రాహుల్ ప్రచారాన్ని నిషేధించాలని భాజపా ఫిర్యాదు
మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలంటూ యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని నేతలు కోరారు. మార్చి 1న కన్యాకుమారి జిల్లా ములగుమూడులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో రాహుల్ గాంధీ రాజకీయ ప్రచారం నిర్వహించారంటూ భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జి బాలచంద్రన్ ఆరోపించారు. విద్యాసంస్థలో రాజకీయ ప్రచారం చేసిన రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు.