బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని పలు జోన్లకు పార్టీ పరిశీలకులను నియమించింది. అబ్జర్వర్లు, కో-అబ్జర్వర్లతో పాటు కన్వినర్ల జాబితాను రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు.
ఇదీ చదవండి:బంగాల్ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా?
కోల్‌కతా జోన్‌కు సోవన్ ఛటర్జీని పరిశీలకుడిగా, దేబ్జిత్ సర్కార్‌ను కన్వినర్‌గా నియమించింది భాజపా. బైసాక్షి బెనర్జీ, శంకుదేబ్ పాండాలను కో-కన్వినర్లుగా నియమించింది. కూచ్ బెహర్ జిల్లాకు దీపెన్ ప్రమాణిక్, డార్జీలింగ్ జిల్లాకు భాస్కర్ దే, దక్షిణ దినాజ్‌పుర్‌కు అమితవా మైత్రా, ఉత్తర ముషీరాబాద్ జిల్లాకు మనబేంద్ర చక్రబర్తి, ఉత్తర నదియాకు గోపాల్ సర్కార్, బసిర్హాట్ జిల్లాకు ప్రదీప్ బెనర్జీ, ఉత్తర కోల్‌కతాకు మానస్ భట్టాచార్యలను పరిశీలకులుగా నియమించింది.
ఇదీ చదవండి:బంగాల్‌లో భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జ్