కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది భాజపా. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించింది. ఈ మేరకు వివరాలు వెల్లడించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్. ఇతర అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.
పార్టీ కోరితే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు తాను సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు శ్రీధరన్. అధికారం చేపడితే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసి, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.