తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం ఎన్నికలు: 70 స్థానాల్లో భాజపా అభ్యర్థులు ఖరారు

అసోంలో శాసనసభ ఎన్నికల ముందు ఎన్డీఏ సీట్ల సర్దుబాటు ప్రక్రియ ముగిసింది. మొత్తం 126 స్థానాల్లో.. 70 చోట్ల భాజపా అభ్యర్థులను ప్రకటించింది. 26 స్థానాలు అసోం గణ పరిషత్​, యునైటెడ్​ పీపుల్స్​ పార్టీ లిబరల్​కు 8 స్థానాలు కేటాయించగా.. మిగతా చోట్లా భాజపా బరిలోకి దిగే సూచనలున్నాయి.

BJP announces 70 candidates for Assam polls
అసోం తొలిదశ పోలింగ్​లో భాజపా 70స్థానాల్లో పోటీ

By

Published : Mar 5, 2021, 10:01 PM IST

అసోంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఆ రాష్ట్రంలో మొత్తం 126 స్థానాలుండగా.. అసోం గణ పరిషత్(ఏజీపీ)​కు 26, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్‌కు 8 సీట్లు కేటాయించింది. మిగిలిన సీట్ల(92)లో భాజపా పోటీ చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :బంగాల్​లో 20, అసోంలో 6 భారీ ర్యాలీలకు మోదీ!

తొలి విడతగా 70 చోట్ల పోటీచేసే తమ అభ్యర్థుల జాబితాను భాజపా విడుదల చేసింది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌.. మజులీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 11 మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించిన భాజపా.. కొత్తవారికి అవకాశం కల్పించింది.

అసోంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 9న ముగియనుంది. రెండు, మూడు విడతల తేదీలు వరుసగా మార్చి 12, 19న ముగియనున్నాయి.

ఇదీ చదవండి:అసోం కోసం 'ఛత్తీస్​గఢ్'​ ఫార్ములా- రంగంలోకి బఘేల్

ABOUT THE AUTHOR

...view details