వరి కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని భాజపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగగా... ఒడిశా అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రైతుల పట్ల సర్కారు నిర్లక్ష్యం కనబరుస్తోందని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.
ఆత్మహత్యాయత్నం చేసిన ఎమ్మెల్యే క్షమాపణకు డిమాండ్
రైతు సమస్యలపై విపక్షాల ఆందోళనతో ఒడిశా శాసనసభలో గందరగోళం నెలకొంది. భాజపా, కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలపగా... అధికార బీజేడీ ఎదురుదాడికి దిగింది. ఇటీవల అసెంబ్లీలో ఆత్మహత్యాయత్నం చేసిన భాజపా ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
అసెంబ్లీలో భాజపా, కాంగ్రెస్ నేతల ఆగ్రహం
ఈ నేపథ్యంలో ఎదురుదాడికి దిగారు బీజేడీ నేతలు. భాజపా ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి నుంచి క్షమాపణలు కోరారు. వ్యవసాయ మార్కెట్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కొద్దిరోజుల క్రితం సుభాష్ అసెంబ్లీలో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడాన్ని తప్పుపట్టారు.